Page Loader
Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి 
విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశ్వక్‌ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా, సాహు గార్లపాటి నిర్మాణం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదల కాగా, వాటికి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో, మూవీ ప్రీ-రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Details

చిరంజీవిని సన్మానించిన విశ్వక్ సేన్

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా నటుడు విశ్వక్‌ సేన్, నిర్మాత సాహు గార్లపాటి నేడు చిరంజీవిని స్వయంగా కలిసి ప్రీ-రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం విశ్వక్‌ సేన్ చిరంజీవికి గజమాలతో సన్మానించి హనుమాన్ విగ్రహాన్ని బహుకరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెగాస్టార్ ను కలిసిన విశ్వక్ సేన్