
Manika Vishwakarma: 'మిస్ యూనివర్స్ ఇండియా 2025'గా మణిక విశ్వకర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 18న జైపూర్‌లో ఘనంగా జరిగిన పోటీల్లో ఆమె విజయం సాధించారు. గత సంవత్సరం విజేతగా నిలిచిన రియా సింఘా ఈ సారి మణికకు కిరీటాన్ని ధరింపజేశారు. రాబోయే నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ ప్రపంచ పోటీల్లో భారత తరఫున మణిక పాల్గొననున్నారు. ఈ జాతీయ పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలవగా, హర్యానా నుంచి పోటీ చేసిన అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
వివరాలు
క్లాసికల్ డ్యాన్సర్‌గా అనేక జాతీయ స్థాయి ప్రదర్శనలతో గుర్తింపు
మణిక విజేతగా నిలవడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా శోధన జరుగుతోంది. రాజస్థాన్‌లో జన్మించిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తూ, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు కళారంగంలోనూ చురుకుగా ఉన్న మణిక క్లాసికల్ డ్యాన్సర్‌గా అనేక జాతీయ స్థాయి ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అదనంగా చిత్రలేఖనంలో మంచి నైపుణ్యం కలిగివున్నారు. 2024లో మిస్ యూనివర్స్ రాజస్థాన్ టైటిల్‌ను కూడా గెలుచుకోవడం ఆమె ప్రత్యేకత. అంతేకాకుండా మణికకు సేవాస్పూర్తి కూడా బలంగా ఉంది. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి, న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందిస్తున్నారు. అందచందాలతో పాటు సామాజిక సేవలోనూ ముందంజ వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.