Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సంగీతకారుడి ఇంటికి నిప్పు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. తిరుగుబాటు తర్వాత హిందువుల ఇళ్లకు కూడా నిప్పు పెడుతున్నారు.
ఈ క్రమంలో దేశంలోని హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులకు తెగబడుతున్నారు.
హిందువుల ఇళ్లపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి.
తాజాగా ఢాకాలో హిందూ సంగీతకారుడు రాహుల్ ఆనంద ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ దాడి నుంచి ఆనంద, అతని భార్య, కుమారుడు ఎలాంటి ప్రమాదం లేకుండా తప్పించుకున్నారు.
వివరాలు
3 వేలకుపైగా సంగీత వాయిద్యాలకు నిప్పు
బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడంతో, షేక్ హసీనా సోమవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టారు.
హసీనా రాజీనామా అనంతరం పలువురు ఆందోళనకారులు ప్రధాని నివాసం గణ భవన్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి వస్తువులను లూటీ చేశారు. అనేక ఇళ్లకు నిప్పుపెట్టి, ధ్వంసం చేశారు.
ఇప్పుడు రాహుల్ ఢాకా బేస్డ్ ధన్మొండి 32ని మధ్యాహ్నం టార్గెట్ చేశారు. అయితే ఈ దాడి నుంచి రాహుల్, అతని భార్య, కుమారుడు తప్పించుకోగలిగారు.
ఇంటికి నిప్పు పెట్టడానికి ముందు ఆందోళనకారులు 3 వేలకుపైగా సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు.
విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. రాహుల్ ఆనంద ఢాకాలో జోలెర్ గాన్ అనే ప్రసిద్ధ జానపద బ్యాండ్‌ను నడుపుతున్నారు.