
upcoming movies: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారంలాగే ఓటీటీలో సినిమాలు,వెబ్‌సిరీస్‌లు మనల్నిఅలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు,వెబ్‌సిరీస్‌లేంటో చూసేయండి. ముందుగా ఏ సినిమా ఏఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఇప్పుడు ఓటీటీ వేదికపై అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ద్వారా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. క్లైమాక్స్ సహా కొన్ని సన్నివేశాల్లో కొంత మార్పు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటు ఉంది.
వివరాలు
'సూత్రవాక్యం'
మలయాళ సినిమా 'సూత్రవాక్యం' (Soothravakyam)లో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది. తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ చిత్రం ETV Win ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మరో సినిమా సిద్ధమైంది. ఆగస్టు 22 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికపై 'మారీశన్' (Maareesan) విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం సుదీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది.
వివరాలు
తలైవా తలైవి
తాజాగా విజయ్ సేతుపతి,నిత్యా మీనన్ నటించిన చిత్రం'తలైవా తలైవి'తెలుగులో 'సార్ మేడమ్' పేరుతో విడుదలైంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈకథ ఇప్పుడు ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఆగస్టు 22 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం'కొత్తపల్లిలో ఒకప్పుడు' వస్తోంది. ఈకామెడీ డ్రామా మూవీ ఆగస్టు 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.'ఆహా గోల్డ్' సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు ఇపుడే వీక్షించవచ్చు. ఈచిత్రం ప్రవీణ్ పరుచూరి దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా. నిర్మాతలు కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల ద్వారా పేరొందిన ప్రవీణ్ పరుచూరి. హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు.ఈ చిత్రంలో మనోజ్ చంద్ర,మౌనిక తదితరులు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
వివరాలు
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్ రివర్స్ ఆఫ్ ఫేట్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. హోస్టేజ్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. మా (హిందీ మూవీ) ఆగస్టు 22 ది కిల్లర్ (మూవీ) ఆగస్టు 24 అమెజాన్ ప్రైమ్ రోడ్‌ఆన్ ఏ మిలియన్ సీజన్2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 22 జియో హాట్‌స్టార్ పీస్ మేకర్‌సీజన్2 (వెబ్‌సిరీస్) ఆగస్టు 21 యాపిల్ టీవీ ఇన్‌వేషన్: సీజన్3 (వెబ్‌సిరీస్) ఆగస్టు 22