LOADING...
Dhanush-Mrunal: ధనుష్ డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్.. దేవత పాత్రలో మెరవనున్న బ్యూటీ
ధనుష్ డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్.. దేవత పాత్రలో మెరవనున్న బ్యూటీ

Dhanush-Mrunal: ధనుష్ డైరెక్షన్‌లో మృణాల్ ఠాకూర్.. దేవత పాత్రలో మెరవనున్న బ్యూటీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 21, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధనుష్ తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె దేవతలా కనిపించబోతుందని టాక్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ధనుష్-మృణాల్ మధ్య డేటింగ్ గాసిప్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి.

వివరాలు

 మరోసారి దర్శకుడిగా ధనుష్..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరుగాంచిన ధనుష్, దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించాడు. ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన, ఇప్పుడు మహిళా ప్రధాన కథతో మరో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ఎంపిక అయ్యిందనే ప్రచారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ కథగా రూపొందించబోతున్నారని తెలుస్తోంది. కథ మొత్తం మహిళా పాత్ర చుట్టూ తిరుగుతుందని, అందులో మృణాల్ ప్రధాన పాత్రలో కనిపించనుందని వార్తలు చెబుతున్నాయి. ఇది పీరియాడిక్ డ్రామా తరహాలో ఉండబోతుందని, సినిమాలో ఆమె దేవత రూపంలో దర్శనమివ్వనుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలు

డేటింగ్ రూమర్లకు చెక్..

ఇటీవలి కాలంలో ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య సంబంధం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మృణాల్ నటించిన ఒక సినిమా ప్రీమియర్‌కు ధనుష్ ప్రత్యేకంగా హాజరుకావడం ఈ గాసిప్స్‌కు బలం చేకూర్చింది. తరువాత ధనుష్ మూవీ టీమ్ నిర్వహించిన పార్టీలో కూడా మృణాల్ కనిపించడం చర్చనీయాంశమైంది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. 1970ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని కథ నడుస్తుందని చెబుతున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ అందించనున్నాడని టాక్. అలాగే ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ 'వండర్ బార్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నాడని వినిపిస్తోంది.

Advertisement

వివరాలు

'డెకాయిట్'తో సక్సెస్

ఇంకా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా వెలువడింది. అయితే ఈ వార్తలను మృణాల్ ఠాకూర్ ఖండించింది. ఇటీవల మృణాల్ ఠాకూర్ నటించిన తెలుగు సినిమా 'డెకాయిట్' ప్రేక్షకులను అలరించింది. ఇందులో అడివి శేష్ హీరోగా నటించాడు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా మంచి స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధిస్తూ, అడివి శేష్ కెరీర్‌లో మరో విజయంగా నిలిచింది.

Advertisement