Page Loader
Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?
నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?

Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని కుటుంబంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్టు సమాచారం. ఆగష్టులో వీరి నిశ్చితార్థం పూర్తికాగా, ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. శోభిత ఇంట్లో పసుపు సంబరాలు మొదలై, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట, వీరి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేసినా, నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భం కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌ను ఎంపిక చేసి, వేదికను ప్రత్యేకంగా అలంకరించే పనులు వేగంగా జరుగుతున్నాయి.

వివరాలు 

అక్కినేని అభిమానుల నిరుత్సాహం 

ఇక అక్కినేని అభిమానులు మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ పై చర్చించుకుంటున్నారు. తమ హీరో నాగచైతన్య వివాహం ఎన్-కన్వెన్షన్‌లో కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు తెలియడంతో కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.