Page Loader
Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్!

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 23, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అందగాడు నాగ చైతన్య,ఈ మధ్యనే టాలీవుడ్ కో-స్టార్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. సమంత రూత్ ప్రభుతో విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత, ఆగస్టు 8న చైతన్య, శోభితల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ జంట త్వరలో ఒకరికొకరు కానున్నారు. మీడియా కథనాల ప్రకారం శోభిత,చైతన్య వివాహం రాజస్థాన్‌లో జరగవచ్చని సమాచారం.

వివరాలు 

5 స్టార్ హోటల్‌ను బుక్ చేసుకున్నారు 

123 తెలుగులో వచ్చిన కథనం ప్రకారం, శోభిత, చైతన్య తమ పెళ్లి కోసం రాజస్థాన్‌లో 5 స్టార్ హోటల్‌ను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మార్చి 2025లో ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. నాగ చైతన్య ,శోభిత కుటుంబ సభ్యులు,స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒకటికానున్నారు. నాగ చైతన్య 2017 లో సమంతను వివాహం చేసుకున్నాడు, కానీ 2021 లో,వారు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు, ఆ తర్వాత నాగ నటి శోభితతో డేటింగ్ ప్రారంభించాడు. 3 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన నాగ, శోభిత ఆగస్టు 8 న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగార్జున వారి నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.