LOADING...
Samantha - Naga Chaitanya: సమంత- నాగ చైతన్య విడాకులపై నాగ సుశీల క్లారిటీ
సమంత- నాగ చైతన్య విడాకులపై నాగ సుశీల క్లారిటీ

Samantha - Naga Chaitanya: సమంత- నాగ చైతన్య విడాకులపై నాగ సుశీల క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ ప్రముఖ మాజీ జంట సమంత-నాగ చైతన్య విడాకుల అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వీరిద్దరూ విడిపోయి ఎన్నాళ్లయినా, అసలు కారణాలపై వస్తున్న ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో నాగచైతన్య మేనత్త నాగ సుశీల తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ సుశీల, చైతూ-సమంత వివాహం, విడాకులపై కుటుంబం వైఖరిని వెల్లడించారు. చైతూ-సమంత పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు మేమెప్పుడూ వ్యతిరేకించలేదు. అదే విధంగా వారు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా ఎలాంటి అడ్డంకి కల్పించలేదు. ఆ నిర్ణయాన్ని పూర్తిగా వారికే వదిలేశాం. మేము వారిని నిందించలేదని ఆమె స్పష్టం చేశారు.

Details

నిర్ణయాన్ని వాళ్లకే వదిలేశాం

'ఏ మాయ చేశావే' సినిమాతో దగ్గరైన చైతన్య-సమంత, ఎన్నో ఏళ్ల ప్రేమ అనంతరం 2017లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో అత్యంత క్యూట్ కపుల్‌గా గుర్తింపు పొందిన వీరి బంధం కేవలం నాలుగేళ్లకే ముగిసింది. 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ఇచ్చారు. అప్పటి నుంచి వీరి విడాకులపై అనేక వదంతులు రేగినా, సమంత-చైతన్య ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. విడాకుల తర్వాత ఇద్దరూ తమ కెరీర్‌లపై దృష్టి సారించారు. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకుని సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సమంత నటిగా మాత్రమే కాక, నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నాగసుశీల చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబం ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి.