Page Loader
Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్
ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్

Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర రంగాన్ని మరింత ఉత్సాహపర్చే దిశగా ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తాజా ప్రకటన ప్రకారం త్వరలోనే నంది అవార్డులను మళ్లీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు నంది అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సినిమాకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో కృషి జరుగుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరహాలో విశాఖపట్టణాన్ని చలనచిత్ర కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

Details

ఈనెల 30న భైరవం రిలీజ్

ఇక ఏపీలో సినిమా షూటింగ్ స్పాట్ల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామని, ఈ రంగానికి మరింత దిశానిర్దేశం చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏలూరులో 'భైరవం' సినిమా ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్‌తో పాటు హీరోయిన్‌లు, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ నెల 30న మల్టీ స్టారర్ తెలుగు చిత్రం 'భైరవం' థియేటర్లలో విడుదల కాబోతోంది.