Page Loader
Nandyala-Allu Arjun-Election Campaign: నంద్యాలలో అల్లు అర్జున్​ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం కోసం నంద్యాలకు వచ్చిన అల్లు అర్జున్

Nandyala-Allu Arjun-Election Campaign: నంద్యాలలో అల్లు అర్జున్​ ఎన్నికల ప్రచారం

వ్రాసిన వారు Stalin
May 11, 2024
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్​ శనివారం నంద్యాల వెళ్లారు. అల్లు అర్జున్​ ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శిల్పా రవి ఇంటివద్ద అభిమానులు జన సంద్రాన్ని తలపించారు. అల్లు అర్జున్​ వారందర్నీ ఛేదించుకుంటూ శిల్పా రవి ఇంటిలోకి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇక అభిమానుల్ని నిరుత్సాహ పరచడం ఇష్టం లేని బన్నీ తన మిత్రుడు ఇంటి బాల్కనీ నుంచి ఫ్యాన్స్​ కు చేతులూపుతూ అభివాదం చేశారు.

Nandyala-Allu Arjun

గత ఎన్నికల్లోనూ ప్రచారం చేసిన బన్నీ

గత ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ శాసన సభ నియోజకర్గం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేశారు. అప్పుడు కూడా శిల్పా రవికి అల్లు అర్జున్​ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో శిల్పా రవి గెలుపొందారు. రాజకీయం వేరు స్నేహం వేరు అని ఈ సందర్భంగా బన్నీ నిరూపించారు. ఓ వైపు బన్నీ ఫ్యాన్స్​, మరోవైపు వైసీపీ కార్యకర్తలతో నంద్యాల కిక్కిరిసిపోయింది.