
SSMB29: 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' విజువల్స్ లీక్.. స్పందించిన హీరో నాని
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న (SSMB 29) విషయం తెలిసిందే.
ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.ఇటీవలి కాలంలో ఒడిశాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా, కొన్ని విజువల్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
ఈ లీక్స్ విషయంపై తాజాగా నటుడు నాని స్పందించారు. ఇలాంటి పనులు చేయడానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయన్నారు.
వివరాలు
ఇలాంటి పనులకు ఎన్నో అడ్డదారులు..
"రాజమౌళి లాంటి లెజెండరీ డైరెక్టర్ సినిమా అంటే వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పని చేస్తారు.ప్రతీ విభాగంలోనూ వందల మంది యాక్టివ్‌గా ఉన్నారు.షూటింగ్ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు అనుమతించరు. అయినప్పటికీ కొందరు చిత్ర బృందం కళ్లుకప్పి ఫోన్ తీసుకెళ్తారు. ఒక ఫోన్ తనిఖీ బృందానికి అప్పగించి, మరొక ఫోన్‌ను రహస్యంగా తీసుకెళ్తారు. ఆ తర్వాత ఎవరూ చూడకుండా ఫోటోలు తీయడం,వీడియోలు రికార్డ్ చేసి లీక్ చేయడం జరుగుతోంది. ఇలాంటి పనులకు ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. ఎంత జాగ్రత్తపడినా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.రాజమౌళి గారు సినిమా పూర్తి రహస్యంగా ఉంచాలనే ప్రయత్నించినా,కొన్ని విజువల్స్ బయటకి వచ్చాయి.ఇది బాధాకరం. అలాంటి ఘటనలపై తగిన చర్యలు తీసుకొని,ఇకపై జరుగకుండా చూడాలి,"అని నాని అన్నారు.
వివరాలు
ప్రియాంకపై యాక్షన్ సన్నివేశాలు..
ఇకపోతే, ఇటీవల ఒడిశాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేశ్ బాబును చూపించే కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎంతో మంది వాటిని షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన సినిమా యూనిట్ వెంటనే చర్యలకు దిగింది.
నెటిజన్లు షేర్ చేసిన వీడియోలను తొలగించడంతో పాటు భద్రతను మరింత పెంచారు.
ఈ లీక్ ఘటన తర్వాత 'ఎస్‌ఎస్‌ఎంబీ 29' చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌కు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
ఈ మధ్య జరిగిన షెడ్యూల్‌లో మహేశ్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా తదితరులు పాల్గొన్నారు.
అందులో ప్రియాంక కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.