LOADING...
Dhanush : నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదం.. నయనతారపై కేసు పెట్టిన ధనుష్
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదం.. నయనతారపై కేసు పెట్టిన ధనుష్

Dhanush : నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదం.. నయనతారపై కేసు పెట్టిన ధనుష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, వారి సంస్థ 'రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్', మరో ఇద్దరు, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ "బియాండ్ ది ఫెయిరీ టేల్"లో ధనుష్ నటించిన 'నానుమ్ రౌడీ ధాన్' చిత్రానికి సంబంధించిన విజువల్స్‌ను ఆయన అనుమతి లేకుండా వాడినట్లు ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే నయనతార, ధనుష్ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై నయనతార తీవ్ర స్థాయిలో స్పందించారు.

Details

ధనుష్ పై అగ్రహం వ్యక్తం నయనతార

"మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో నటుడయ్యారని, కానీ తాను కష్టంతో ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇప్పుడు తన జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసుకుంటోందని, కానీ 'నానుమ్ రౌడీ ధాన్' ఫొటోలు వాడటానికి తాను ఎన్‌వోసీ అడిగినప్పుడు, రెండు సంవత్సరాలుగా తిరస్కరిస్తున్నారని చెప్పింది. 3 సెకన్ల ఫొటోకు రూ.10 కోట్లు ఎలా అడుగుతున్నారు? అని నయనతార ఆగ్రహం వ్యక్తం చేశారు.