
SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి,టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమా.ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్ గురించి ఓ వార్త వైరలవుతోంది.దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
'రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్ అయినా మేమే ఇస్తాం ,అని శ్రీ దుర్గ ఆర్ట్స్ పేర్కొంది.
సినిమా ఔత్సాహికులు ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం త్వరలోనే నిర్మాణాన్ని ప్రారంభించనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్లారిఫికేషన్ ఇచ్చిన శ్రీ దుర్గ ఆర్ట్స్
Official Clarification on Casting Rumors for #SSRajamouli & #MaheshBabu's Upcoming Film under Sri Durga Arts. pic.twitter.com/WRKxxFGn3D
— Gulte (@GulteOfficial) May 17, 2024