LOADING...
Oscar 2025: 'అనుజ'కు నిరాశ.. ఆస్కార్‌లో దక్కని చోటు
'అనుజ'కు నిరాశ.. ఆస్కార్‌లో దక్కని చోటు

Oscar 2025: 'అనుజ'కు నిరాశ.. ఆస్కార్‌లో దక్కని చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

97వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో 'అనూజ' (Anuja) మాత్రమే భారత్‌ నుంచి పోటీలో నిలిచింది. అయితే, చివరి వరకు ఆస్కార్ రేసులో ఉన్న ఈ చిత్రానికి అవార్డు దక్కలేదు. 'అనూజ'కు తప్పకుండా అవార్డు వస్తుందని భావించిన భారత అభిమానులకు ఈ ఫలితం నిరాశ కలిగించింది. ఈ విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన 'ఐ యామ్ నాట్ ఎ రోబోట్' ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రాన్ని నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వేదికల్లో వీక్షించవచ్చు. ఆస్కార్‌ గెలవడానికి అనూజ మరో ఐదు చిత్రాలతో పోటీపడింది.

వివరాలు 

ప్రియాంక చోప్రా ఆశలు అడియాసలే 

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అనేక ప్రేక్షకాదరణ పొందిన పాత్రలు పోషించినప్పటికీ, 'అనూజ' చిత్రంతో తన అత్యుత్తమ అభిరుచిని చాటుకుంది. ఈ చిత్రం 97వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో షార్ట్‌లిస్ట్‌ అవ్వగానే భారత అభిమానులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు మిండి కాలింగ్, గునిత్‌ మోగాలతో పాటు ప్రియాంక చోప్రా వెన్నుదన్నుగా నిలిచారు.

వివరాలు 

బాల కార్మికుల జీవన పోరాటం- అనూజ కథ  

బాల కార్మికుల జీవితం, వారి పోరాటాన్ని ప్రతిబింబించిన 'అనూజ' లఘు చిత్రానికి ఆడమ్‌ జోగ్రేవ్స్‌ దర్శకత్వం వహించారు. ఈ కథలో తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. కానీ, భవిష్యత్తు కోసం పని మానేసి చదువుకోవాలా? లేక కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే తర్జనభర్జనలో ఉంటుంది. ఈ సందిగ్ధతనే 'అనూజ' షార్ట్‌ ఫిల్మ్‌ అత్యద్భుతంగా చూపించింది. పేదరికంలో పుట్టిన బాలలు తమ కలల కోసం ఎంత పోరాడాలి? సమాజం వారిని ఎంతవరకు అర్థం చేసుకుంటుంది? అనే అంశాలను ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించింది. ప్రియాంక చోప్రా, ''ఈ అద్భుతమైన సినిమాపై గర్వంగా ఉంది'' అంటూ తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్కార్‌ను గెలుచుకున్న 'ఐ యామ్ నాట్ ఏ రోబో'

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్‌గా..

అనన్య షాన్‌ బాగ్‌ (పాలక్‌), సజ్దా పఠాన్‌ (అనూజ), నగేష్‌ బోంస్లే (మిస్టర్‌ వర్మ) ముఖ్యపాత్రలు పోషించారు. ప్రత్యేకంగా, సజ్దా పఠాన్‌ జీవితం ఆధారంగానే ఈ కథ రూపొందించబడింది. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం పోరాడే ఇద్దరు సోదరీమణుల కథగా 'అనూజ' నిలిచింది. అవార్డు దక్కకపోయినా, 'అనూజ' భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది!