Page Loader
Hari Hara VeeraMallu : 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, ఈవెంట్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, ఈవెంట్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?

Hari Hara VeeraMallu : 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, ఈవెంట్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న విడుదల కాబోతోంది. అయితే సినిమా విడుదల కంటే ముందే, అభిమానులు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ఇప్పటికే వదంతులు, ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటగా తిరుపతిలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలనుకున్నా, చివరకు వేదికను మార్చినట్లు సమాచారం. అంతేకాదు,ఉత్తర భారతదేశ ప్రేక్షకుల కోసం కాశీలో ప్రత్యేకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

పవన్ కళ్యాణ్ ఈవెంట్‌లో ఏమి మాట్లాడతారు?

ఇందులో భాగంగా తాజాగా హరిహర వీరమల్లు సినిమా యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ ఈవెంట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా ఎవరిని ఆహ్వానిస్తారు? పవన్ కళ్యాణ్ ఈవెంట్‌లో ఏమి మాట్లాడతారు? అనే విషయాలపై ఉత్సుకత నెలకొంది.

వివరాలు 

ఉత్తరభారత దేశంలో మరో ప్రత్యేకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? లేదా?

తిరుపతిలో భారీ బహిరంగ ప్రాంగణంలో ఈవెంట్ నిర్వహించాలనుకున్నా, భారీ సంఖ్యలో అభిమానులు రావచ్చన్న అంచనాల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ ప్లాన్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని సంఖ్యలో ఉన్న అభిమానులతో పాటు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే, ఇండోర్ లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఉత్తరభారత దేశంలో మరో ప్రత్యేకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? లేదా? అనే విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మెగా సూర్య ప్రొడక్షన్ చేసిన ట్వీట్