LOADING...
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్

వ్రాసిన వారు Moogati Shabari
May 04, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వల్ప శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన సందర్భంలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానుల్లో నమ్మకం పెరిగింది. ఆ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కనిపించడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు

"కొంత సమయం ఇవ్వండి" - అన్నాలెజినోవా విజ్ఞప్తి

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అభిమానులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవాను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ, "పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం స్థిరంగా ఉన్నారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఈ సమయంలో ఆయనకు విశ్రాంతి, ప్రశాంతత చాలా అవసరం. పూర్తిగా కోలుకునేందుకు ఆయనకు కొంత సమయం, వ్యక్తిగత గోప్యత ఇవ్వాలి" అని అభ్యర్థించారు. సెలబ్రిటీ అయినప్పటికీ భార్యగా ఆమె చేసిన ఈ ప్రైవసీ అభ్యర్థనకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇదిలా ఉండగా, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు.

వివరాలు

రాజకీయాలు, సినిమాలపై ప్రభావం

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచనల ప్రకారం ఇంకా కొన్ని రోజులు ఆయన విశ్రాంతిలో ఉండాల్సి ఉంటుంది. ఆయన పూర్తిగా కోలుకున్న తరువాతే మళ్లీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం షూటింగ్‌లకు ఆయన విరామం ప్రకటించారు. ప్రస్తుతం జనసేన అధినేత తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. ఆయన మళ్లీ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారో అని రాజకీయ వర్గాలు, అలాగే సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఆయన తదుపరి చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

Advertisement