
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ.. స్పెషల్ ఫొటోతో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేయడం విశేషం. 'శ్రీ పవన్ కళ్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎంతోమంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి పెట్టుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారు. మీరు దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని మోదీ ట్వీట్ చేశారు.
Details
డిప్యూటీ సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామ పవర్ స్టార్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'పవర్ స్టార్, డిప్యూటీ సీఎంకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. అలాగే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు. 'చరిత్రలో ఒకే ఒక్కడు.. కోట్లాది మంది గుండెల్లో ఆశాజ్యోతిగా నిలిచిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్‌డే మై బాస్' అని ట్వీట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ తన మామకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'నాకు పట్టుదల నేర్పించి, నాలో ఆత్మవిశ్వాసం నింపిన నా గురువుకి హ్యాపీ బర్త్‌డే మామ' అంటూ ట్వీట్ చేశారు.
Details
సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్
దర్శకుడు జ్యోతికృష్ణ కూడా స్పందిస్తూ 'మీరు లక్షల మందికి స్పూర్తి. నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రం బృందం కూడా ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ పవన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అదే పోస్టర్‌తో సెప్టెంబర్ 25న 'ఓజీ' మూవీ విడుదల కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Best wishes to Shri Pawan Kalyan Ji on his birthday. He’s made a mark in hearts and minds of countless people. He is strengthening the NDA in Andhra Pradesh by focusing on good governance. Praying for his long and healthy life.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) September 2, 2025