Prabhas Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ పై క్రేజీ అప్‌డేట్ చెప్పిన ప్రొడ్యూసర్
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రంతో భారతీయ సినిమా ప్రపంచం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని చిత్రబృందం ముందే ప్రకటించింది. తాజాగా, 'కల్కి 2' గురించి చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ,కల్కి 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
రెండో భాగంలో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ప్రభాస్, కమల్ హాసన్ మధ్య కీలకమైన సన్నివేశాలు ఉండనున్నాయి.
అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా ప్రాధాన్యం ఉంటుంది.ఈ మూడు ప్రధాన పాత్రలు సినిమాకు కీలకంగా మారనున్నాయి.
వీరితో పాటు,దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో కనిపించనున్నది.
వివరాలు
నాగ్ అశ్విన్ కు జీవితంలో ఓటమి ఉండదు: అశ్విని దత్త్
కొత్త నటులను తీసుకోవడంపై ఆయన మాట్లాడుతూ, కథ అవసరం కలిగితే కొత్త పాత్రలు తీసుకునే అవకాశముందని తెలిపారు.
నాగ్ అశ్విన్ గురించి మాట్లాడిన అశ్వనీదత్, "మహానటి చిత్రంతో తన ప్రతిభను పూర్తిగా చూపించాడు. ఆ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి, 'కల్కి'ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. రెండు చిత్రాలూ అద్భుత విజయాలు సాధించాయి. నాగ్ అశ్విన్ కు జీవితంలో ఓటమి ఉండదని నాకు నమ్మకం ఉంది. అతడి ఆలోచనా విధానం, సినిమాల డైరెక్షన్ అద్భుతంగా ఉంటాయి" అన్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమా
'కల్కి 2898 AD' చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీసు వద్ద కొత్త మార్కును స్థాపించింది.
ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో సినిమాకు ప్రత్యేకతను ఇచ్చారు.
ప్రభాస్ బౌంటీ ఫైటర్ భైరవగా, చివర్లో కర్ణుడిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరిపోతూ, పార్ట్ 2 పై అంచనాలను మరింత పెంచాడు.