Page Loader
Pushpa 2: ప్రీ సేల్ బుకింగ్స్‌లో 'పుష్ప 2' రికార్డు.. టాప్ 3లో స్థానం
ప్రీ సేల్ బుకింగ్స్‌లో 'పుష్ప 2' రికార్డు.. టాప్ 3లో స్థానం

Pushpa 2: ప్రీ సేల్ బుకింగ్స్‌లో 'పుష్ప 2' రికార్డు.. టాప్ 3లో స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రూల్ సినిమా డిసెంబర్ 5న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ-సేల్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీని ద్వారా చిత్రానికి సరికొత్త రికార్డులు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా హిందీ వెర్షన్‌లో కూడా ఈ చిత్రం టికెట్ అమ్మకాల్లో హవా చూపించింది. 24 గంటల్లోనే ఒక లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా పుష్ప2 బాలీవుడ్‌లో అనేక పెద్ద చిత్రాల రికార్డులను అధిగమించింది.

Details

ప్రీ-సేల్ బుకింగ్స్ ద్వారా రూ.60 కోట్లు వసూలు

ఈ చిత్రం స్త్రీ 2 (41k), డంకీ (42k), యానిమల్ (52.5k), టైగర్ 3 (65k) సినిమాలను బద్ధలు కొట్టింది. ప్రస్తుతం పుష్ప2 బాలీవుడ్‌లో ఆల్-టైమ్ టాప్ 3 చిత్రాలలో స్థానం సంపాదించింది. ప్రస్తుతం, ఈ చిత్రం ప్రీ-సేల్ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు రూ.60 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి, కేజీఎఫ్ 2 వంటి సినిమాలను పుష్ప2 తొలి రోజు వసూళ్లను మించుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.