Page Loader
SSMB 29: కీలక సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన రాజమౌళి?
SSMB 29: కీలక సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన రాజమౌళి?

SSMB 29: కీలక సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన రాజమౌళి?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2024
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు కారం సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 అనే పేరుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వనప్పటికీ ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట షికారు చేస్తోంది. ఈ మూవీ టెక్నీకల్ క్రూ వీరే అంటూ ఒక న్యూస్ అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది.

Details 

హీరోయిన్‌గా ఇండోనేషియా నటి

దాని ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎడిటర్ గా తమ్మిరాజు,సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్,విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఆర్ సి కమల కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి,కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ గా రమా రాజమౌళి ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. మరోవైపు,ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌(chelsea elizabeth islan) ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనే వార్త వైరల్‌ అవుతోంది. దానికి ఒక కారణం ఉంది చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.కాకపోతే ఈ విషయాన్ని కూడా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.