Varanasi: 'వారణాసి' వరల్డ్ గ్లింప్స్.. మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో!
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలోని మెక్సికో సిటీలో నిర్వహిస్తున్న ప్రముఖ పాప్ కల్చర్ వేడుక CCXP MX 2026లో 'వారణాసి' చిత్రబృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి పంపిన వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇదే వేదికపై చిత్రానికి సంబంధించిన తొలి గ్లింప్స్‌ను ప్రదర్శించగా, అద్భుతమైన విజువల్స్‌కు అక్కడి ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన లభించింది. తన వీడియో సందేశంలో రాజమౌళి మెక్సికో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'వారణాసి' ఒక సాధారణ సినిమా కాదని, అది ఓ విశేషమైన సాహసయాత్ర అని తెలిపారు. భారతీయ పురాణాల నేపథ్యాన్ని అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌తో మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు.
వివరాలు
రఫ్ అండ్ టఫ్ స్టైల్‌లో మహేష్ బాబు..
అలాగే హీరో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త రూపంలో ఆయన ఈ సినిమాలో కనిపిస్తారని చెప్పారు. ఈ వేడుకలో చూపించిన గ్లింప్స్‌లో మహేశ్ బాబు గడ్డం, పొడవాటి జుట్టుతో చాలా భిన్నమైన, గంభీరమైన లుక్‌లో కనిపించారు. ఆయనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రఫ్ అండ్ టఫ్ స్టైల్‌లో చూపించినట్టు తెలుస్తోంది.
వివరాలు
హాలీవుడ్ రేంజ్‌లో సినిమా..
అంతేకాకుండా మైనస్ డిగ్రీల చలిలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయని సమాచారం. రాజమౌళి ప్రత్యేకతను ప్రతిబింబించే గ్రాఫిక్స్, కీరవాణి అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. 'RRR' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నాయి. మెక్సికోలో లభించిన ఈ స్థాయి ఆదరణ, చిత్రానికి ప్రపంచ మార్కెట్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న రాజమౌళి వీడియో..
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
— REFORMA (@Reforma) April 25, 2026
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX