
Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రజనీ 'జైలర్ 2' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇతర దర్శకులు కూడా రజనీకాంత్‌తో పని చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే 'పేట' సినిమాతో రజనితో పనిచేసిన కార్తీక్ సుబ్బరాజ్ మరో కథను సిద్ధం చేశాడని సమాచారం. అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా రజనీకి కథ వినిపించినట్టు తెలుస్తోంది.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
అతడే టాలీవుడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ. 'బ్రోచేవారెవరురా', 'సరిపోదా శనివారం', 'అంటే సుందరానికి' వంటి విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. రజనీకాంత్ కోసం ఓ పవర్‌ఫుల్ పాయింట్ రెడీ చేశాడు. ఇటీవల రజనీతో భేటీ అయ్యి కథ వినిపించగా.. సూపర్ స్టార్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇప్పటివరకు శ్రీ విష్ణు, నాని లాంటి నటులతోనే సినిమాలు చేసిన వివేక్ ఆత్రేయ.. ఇప్పుడు రజనీకాంత్ లాంటి లెజెండరీ హీరోతో సినిమా చేస్తుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.