
Rajinikanth-Pawan Kalayn:రాజకీయ తుపాను అంటూ రజనీకాంత్ ట్వీట్.. స్పందించిన పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన ట్వీట్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై 'పొలిటికల్ తుపాను' అని పేర్కొనడం, దానికి పవన్ బదులివ్వడం నెట్టింట విస్తృత చర్చకు దారితీసింది. రజనీకాంత్ తన నట ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దానికి స్పందించిన రజనీకాంత్ ఆదివారం ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా సోదరుడు, పొలిటికల్ తుపాను పవన్ కళ్యాణ్ గారు.. ప్రేమతో మీరు చెప్పిన విషెస్‌కు ఉప్పొంగిపోయా. దాన్ని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మీకు హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు.
Details
ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటూ ట్వీట్
దీనికి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తూ బిగ్ బ్రదర్ రజనీకాంత్.. మీ అభిమానం, ఆశీస్సులకు నేను కృతజ్ఞుడిని. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీరు మరిన్ని విజయాలు సాధించాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇకపోతే రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటుడు కమల్‌హాసన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే, రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.