LOADING...
Ranveer Allahbadia row: వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్ 
వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్

Ranveer Allahbadia row: వివాదాస్పద 'ఇండియాస్ గాట్ లాటెంట్' ఎపిసోడ్‌ను తొలగించిన యూట్యూబ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్‌ అల్హాబాదియా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి ఇటీవల యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు అందుకున్న తరువాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు.

వివరాలు 

 రణవీర్‌ పాడ్‌కాస్ట్‌లో రాజకీయ నాయకులు

''కామెడీ కంటెంట్ పేరిట భాషా హద్దులను దాటి మాట్లాడటం సమర్థనీయం కాదు. ఒక వేదికలో అవకాశం దక్కిందని, ఎవరైనా ఏం కావాలనుకున్నా చెప్పవచ్చని అనుకోవడం తప్పు. రణవీర్‌కు ఎంతో మంది అనుచరులు ఉన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు అతడి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాను'' అని ఆమె ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. 'ఇండియాస్‌ గాట్ లాటెంట్‌' అనే కార్యక్రమంలో రణవీర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు విపక్షాలు కూడా అతడిని తీవ్రంగా విమర్శించాయి.

వివరాలు 

క్షమాపణలు చెబుతూ రణవీర్‌  వీడియో 

ఫడణవీస్‌ మాట్లాడుతూ, ''వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయడం సరైనది కాదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రణవీర్‌ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశాడు. అయినప్పటికీ, అతడి మీద వివిధ నాయకులు కేసులు నమోదు చేయడం జరిగింది.