Page Loader
సినిమాల నుండి 6నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్: కారణమిదే 
ఆరు నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్

సినిమాల నుండి 6నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్: కారణమిదే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 18, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరూపాక్ష సినిమాతో 100కోట్లు కొల్లగొట్టి కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల మార్కును సాయి ధరమ్ తేజ్ సొంతం చేసుకున్నాడు. విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం బ్రో. పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం, జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో బ్రో సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్, బ్రో సినిమా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఫిజికల్ గా మరింత ఫిట్ గా మారడానికి, తర్వాత చేయబోయే సినిమా కోసం 100% తన శక్తిని ఇవ్వడానికి ఆరు నెలలు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Details

సర్జరీ కోసం ఆరు నెలలు 

ఈ ఆరు నెలల విరామ సమయంలో చిన్న సర్జరీ ఉందని, దాని నుండి పూర్తిగా రికవరీ కావడానికి సమయం పడుతుందని సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు. అదలా ఉంచితే, బ్రో సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకునే ఈ సినిమా, ఆరు నెలల తరవాతే ప్రారంభమవుతుంది. ఇక ప్రస్తుతం నటించిన బ్రో సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. జులై 21వ తేదీన బ్రో ట్రైలర్ రిలీజ్ కాబోతుందని నిర్మాత వివేక్ కూచిబొట్ల తెలియజేశారు. జులై 24న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుందని సమాచారం.