Saif Ali Khan stabbing case:సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి.. నిందితుడు షరీఫుల్ ఇస్లాంను గుర్తించిన సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ముందడుగు పడింది.
దర్యాప్తు నేపథ్యంలో ముంబయి పోలీసులు బుధవారం గుర్తింపు పరేడ్ నిర్వహించారు.
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను, ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన సైఫ్ ఇంటి సహాయకులకు చూపించారు.
ఆర్థర్ రోడ్ జైలులో, అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో, నిందితుడిని సహాయకులు గుర్తించారు.
సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి ఇతడేనని ధృవీకరించారు. దాడికి సంబంధించిన వివరాలను మళ్లీ పోలీసులకు తెలియజేశారు.
వివరాలు
నిందితుడికి,సైఫ్ కి మధ్య ఘర్షణ
ఈ ఘటన జనవరి 16న, గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు బాంద్రాలోని సైఫ్ నివాసంలో జరిగింది.
సైఫ్, ఆయన కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా, దుండగుడు ఇంట్లోకి చొరబడి, సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి ప్రవేశించాడు.
ఆ సమయంలో, దుండగుడిని గమనించిన జేహ్ కేర్‌టేకర్ భయంతో కేకలు వేశారు.
వెంటనే సైఫ్ అక్కడికి చేరుకోగానే, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సైఫ్ గాయపడ్డారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్‌కు చెందిన అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, దొంగతనం చేయడానికి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
వివరాలు
షరీఫుల్ ఇస్లాంకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు
అయితే, నిందితుడి కుటుంబ సభ్యులు, షరీఫుల్ ఇస్లాం అమాయకుడని, అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు.
ముంబయి పోలీసులు ఇటీవల ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా సైఫ్ ఇంటి సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు.
ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి, నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లామేనని పోలీసులు నిర్ధారించారు.
అయితే, తొలుత దాడి జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుడివిగా తేలలేదని జాతీయ మీడియా నివేదించిన సంగతి తెలిసిందే.