Samantha : రిఫర్బిష్డ్ వెడ్డింగ్ గౌను ధరించిన సమంత.. ఫోటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి..స్టార్ హీరోయిన్ అయ్యింది.
బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ రేంజ్ స్టార్డం ను అందుకుంది.అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా హవాను కొనసాగిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.
ఇప్పుడు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
2017లో చైతూ,సమంత వివాహం జరిగిన సంగతి తెలిసిందే.పెళ్లిలో సామ్ ధరించిన తెల్లటి గౌనును బ్లాక్ కలర్ లో రీమోడలింగ్ చేయించి.. ఆ గౌనును ముంబైలో జరిగిన ఎల్లే సస్టైనబిలిటీ అవార్డు ఫంక్షన్ వేడుకలో ధరించి స్టేజ్‌పై హొయలొలికించారు.
Details
ఎల్లే లీడర్స్ ఆఫ్ చేంజ్' అవార్డు గెలిచిన సమంత
ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.అంతేకాదు ఈ అవార్డు ఫంక్షన్ లో సమంత 'ఎల్లే లీడర్స్ ఆఫ్ చేంజ్' అవార్డును కూడా గెలుచుకుంది.
ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ ఓ పెద్ద నోట్ రాసుకొచ్చింది ఈ అమ్మడు. "ఇకపై నేను ధృడంగా ఉండడం మర్చిపోలేను. నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చిన క్రేశాబజాజ్ కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసినవారికి ధన్యవాదాలు " అంటూ రాసుకొచ్చింది.