
Mukesh Khanna: రజనీకాంత్‌పై 'శక్తిమాన్' నటుడు ముకేశ్ ఖన్నా ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఎంతో సాదాసీదాగా జీవనం గడుపుతారని అందరికీ తెలిసిందే.
తెరపై కనిపించే సందర్భాలను మినహాయించి,మిగిలిన సమయాల్లో మేకప్ కూడా ఉపయోగించరు.
తాజాగా,బాలీవుడ్ నటుడు ముఖేశ్ ఖన్నా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ రజనీ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు.
వివరాలు
బాలీవుడ్ నటులు ఈ విషయంలో ఆయనలా ఉండలేరు..
''బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ హీరోలతో పోల్చితే రజనీకాంత్ నిజంగా గొప్ప వ్యక్తి. ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ ఎప్పుడూ గొప్పమనిషిలా కాకుండా సాధారణంగా ఉంటారు.బయటకు వెళ్లినప్పుడు మేకప్ వేసుకునే అలవాటు లేదు.విగ్ కూడా ఉపయోగించరు.అభిమానులను కలుసుకునేటప్పుడు కూడా సెలబ్రిటీలా కాకుండా,ఓ సాధారణ వ్యక్తిలా వస్తారు.బాలీవుడ్ నటులు ఈ విషయంలో ఆయనలా ఉండలేరు. ముంబయిలో స్టార్ హీరోలు మేకప్ లేకుండా బయట తిరగలేరు. కానీ రజనీకాంత్ మాత్రం నిజమైన స్టార్.ఇప్పటి వరకు ఆయనను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం నాకు రాలేదు,''అని తెలిపారు.
వివరాలు
దుర్యోధనుడి పాత్రకు నో చెప్పాను: ముఖేశ్ ఖన్నా
అలాగే, ఇదే ఇంటర్వ్యూలో ముఖేశ్ ఖన్నా తనకు పెద్ద డైలాగులు చెప్పడం చాలా ఇష్టమని వెల్లడించారు.
డైలాగులే లేకపోవడంతో అనేక సినిమాలను తిరస్కరించాల్సి వచ్చిందని చెప్పారు.
విలన్ పాత్రలు చేయడం తనకు నచ్చదని, అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంలో ఆసక్తి ఉండదని వివరించారు.
'మహాభారతం' సీరియల్ కోసం తొలుత తనకు దుర్యోధనుడి పాత్రను ఆఫర్ చేయగా, దానిని తిరస్కరించానని తెలిపారు.
ఆ తర్వాత భీష్ముడి పాత్రకు ఎంపికైనట్లు చెప్పారు.అలాగే అనేక హాలీవుడ్ చిత్రాలకు కూడా తను నో చెప్పడం జరిగిందని, అయితే అంతర్జాతీయ సినిమాల్లో నటించకపోవడం గురించి తనకు ఎప్పుడూ బాధలేదని వివరించారు.