Sharwanand: శర్వానంద్-శ్రీను వైట్ల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. సంక్రాంతి టార్గెట్‌గా రేపే ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డైనమిక్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు (ఆగస్టు 14) ఉదయం 9:45 గంటలకు జరగనున్నాయి. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా #SSS1 అని పెట్టారు. శర్వా (Sharwa), శ్రీను (Sreenu), సుంకర (Sunkara) పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఈ టైటిల్‌ను రూపొందించడం ఆసక్తిని కలిగిస్తోంది.
వివరాలు
కామెడీకి సైన్స్ అంశాలను జోడించి సరికొత్త తరహా కథ..
పోస్టర్‌పై 'సైన్స్, సెన్స్, సక్సెస్' అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఉంచారు.
దీంతో శ్రీను వైట్ల తనదైన కామెడీకి సైన్స్ అంశాలను జోడించి సరికొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా? అనే చర్చ మొదలైంది.
చాలా కాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల.. ఈ సినిమాతో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
శర్వానంద్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
శర్వానంద్, శ్రీను వైట్ల, అనిల్ సుంకర కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.