
Sree leela: 'నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను'.. అభిమానుల హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఆమె కెరీర్ ప్రారంభం కన్నడ ఇండస్ట్రీలో అయింది. తరువాత 'పెళ్లి సందడి' అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు పొందుతూ, వరుస హిట్ చిత్రాలతో తన కెరీర్‌ను స్ట్రాంగ్ గా చేసుకున్న లీల ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రాచుర్యం పొందుతోంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ తో జరుగుతోంది. అంతేకాకుండా, శ్రీలీలకు పెద్ద ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
వివరాలు
నేను కూడా అలాగే చేస్తా..
అయితే,తన బిజీ షెడ్యూల్‌కి మధ్యలోనూ శ్రీలీల తన అభిమానుల కోసం సమయం మిస్సవకుండా కేటాయిస్తూ ఉంటారు. తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో చర్చలు చేస్తూ ఉంటారు. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చాట్ సెషన్ నిర్వహించారు.ఆ సందర్భంగా ఒక అభిమాని "నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను" అంటూ సందేశం పంపాడు. దానికి శ్రీలీల స్పందిస్తూ "నేను హెల్ప్ చేయగలనో లేదో తెలియదు కానీ..వెంటనే వెళ్లి మీ కుటుంబ సభ్యుడిని హత్తుకోండి. నేను కూడా అలాగే చేస్తాను.అలాగే మంచి సంగీతం వింటే అది థెరపీలా పనిచేస్తుంది"అని రిప్లై ఇచ్చారు ఈజవాబు అభిమానులు బాగా ఆకట్టుకుంది.ఫ్యాన్ భావోద్వేగాన్ని అర్థం చేసుకొని,ఆ బాధను కొంతమేర తగ్గించేలా స్పందించిన తీరు అందరి హృదయాలను అలరించింది.