Dil Raju: రేవతి కుటుంబానికి అండగా ఉంటాం: దిల్ రాజు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన నిజంగా దురదృష్టకరమైనది. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించాం.రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. అలాగే, అల్లు అర్జున్ తో కూడా కలుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయాన్ని క్రమబద్ధం చేస్తానని వారు చెప్పారు. రేవతి కుటుంబం వినోదం కోసం థియేటర్‌కు వెళ్లారు. కావాలని ఎవరైనా ఇలా చేస్తారా..? అన్నారు దిల్ రాజు.
రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి అవకాశం
రేవతి భర్త భాస్కర్‌కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. దిల్ రాజు, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా బాలుడిని పరామర్శించారు.