
Retro : సూర్య కోసం సూపర్ స్టార్ రజనీకాంత్? చెన్నైలో భారీ ఈవెంట్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
కంగువాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఈసారి బాక్సాఫీస్ దుమ్మురేపేలా భారీ ప్లాన్‌తో ముందుకు వస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రెట్రో' సినిమాతో మళ్లీ మాజీక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.
ప్రపంచవ్యాప్తంగా మే 1న 'రెట్రో' థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 18న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు తమిళ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Details
ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేసే అవకాశం
అదే ఈవెంట్‌లో ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ స్వరపరచిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాను స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2D ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తీక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం డిజిటల్, టెలివిజన్ రైట్స్‌ను ఊహించని రేట్లకు అమ్మినట్టు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను రూ.80 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. అలాగే సన్ టీవీ బ్రాడ్‌కాస్ట్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
Details
రెట్రోపై భారీ అంచనాలు
ఇటీవల సోషల్ మీడియాలో సూర్య లుక్స్ వైరల్ కావడంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవలి ఫెయిల్యూర్స్‌తో ఒత్తిడిలో ఉన్న సూర్య, పూజా హెగ్డేల కోసం ఈ సినిమా చాలా కీలకమైంది.
వీరిద్దరికీ కార్తీక్ సుబ్బరాజు ఒక బిగ్ హిట్ ఇస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.