Page Loader
Retro: ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..
ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..

Retro: ఓటీటీలోకి సూర్య 'రెట్రో'!.. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రెట్రో', ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం‌కు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇది రొమాంటిక్‌ అండ్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన సినిమాగా ఉండగా, మే 31వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు వస్తున్నా, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించి విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, జయరామ్, నాజర్, ప్రకాశ్‌ రాజ్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వివరాలు 

కథేంటంటే..

పారి అలియాస్‌ పార్వేల్‌ కన్నన్‌(సూర్య)చిన్నప్పుడే పుట్టిన ఊరికి..తల్లిదండ్రులకు దూరమవుతాడు. ఒక అనాథగా జీవిస్తున్న అతన్ని గ్యాంగ్‌స్టర్‌ తిలక్‌(జోజు జార్జ్‌)తన భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఒక సందర్భంలో తిలక్‌పై దాడి జరుగుతుంటే,పారి అతడిని రక్షించడంతో అతని మనసులో నిజమైన కొడుకులా స్థానం సంపాదించుకుంటాడు. ఈఘటన అనంతరం తిలక్‌ అండలో పారి కూడా శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అయితే తన జీవితంలో రుక్మిణి (పూజా హెగ్డే) ప్ర‌వేశించ‌డంతో పరిస్థితులు మారుతాయి. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న పారి,ఇక హింసాత్మక జీవితాన్ని వీడి శాంతియుతంగా బతకాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని గతం అంత సులభంగా వదిలిపెట్టేదా?పారి అనుకున్నట్టే హింసను వదిలి సుఖంగా జీవించగలిగాడా?అతని జీవితంలో దాగున్న రహస్యాలేమిటి?అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన ఆసక్తికరమైన అంశం.