NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / SSMB 29: SSMB 29 గురించి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు.. మహేశ్‌ అభిమానుల్లో జోష్‌ 
    తదుపరి వార్తా కథనం
    SSMB 29: SSMB 29 గురించి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు.. మహేశ్‌ అభిమానుల్లో జోష్‌ 
    SSMB 29 గురించి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు.. మహేశ్‌ అభిమానుల్లో జోష్‌

    SSMB 29: SSMB 29 గురించి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు.. మహేశ్‌ అభిమానుల్లో జోష్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నప్రాజెక్ట్‌లలో 'SSMB 29' ఒకటి.

    రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ చిత్రంకోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఈ చిత్రం పై వస్తున్న ఏ అప్‌డేట్‌ అయ్యిన సరే త్వరగా వైరల్ అవుతోంది.

    తాజాగా, టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ నెటిజన్ల మధ్య తెరమీదకు వస్తున్నాయి.

    వివరాలు 

    బిజినెస్‌ కనీసం రూ.2000 కోట్లు దాటొచ్చు: తమ్మారెడ్డి 

    ''మహేశ్‌-రాజమౌళి (SS Rajamouli)ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ తప్పకుండా రూ.1000 కోట్లను దాటుతుంది.ఈ చిత్రంలో అంతర్జాతీయ నటీనటులు నటిస్తారు.

    అలాగే, ఈ చిత్ర బిజినెస్‌ కనీసం రూ.2000 కోట్లు దాటొచ్చని టీమ్‌ అంచనా వేస్తోంది.ఇక ఈ సంఖ్య రూ.3,000-4,000 కోట్లు దాటినా ఆశ్చర్యం ఉండదు.

    అయితే, ఇది తెలుగు సినిమా, భారతీయ సినీ పరిశ్రమలో కూడా చరిత్రకెక్కే అవకాశం ఉంటుంది.

    ఈ ప్రాజెక్ట్‌ను అంచనా వేయడం కూడా చాలా కష్టం. రాజమౌళి తన విజన్‌తో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.

    'బాహుబలి' వచ్చిన తరువాత తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు, ₹100 కోట్ల చిత్రాలు సాధారణం అయ్యాయి,'ఆర్‌ఆర్‌ఆర్‌' తరువాత ₹300 కోట్ల చిత్రాలు చిన్న బడ్జెట్‌గా కనిపిస్తున్నాయి.

    వివరాలు 

    ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు: తమ్మారెడ్డి 

    ఇప్పుడు మహేశ్‌ సినిమా వచ్చాక ₹500 కోట్ల రూపాయలు సాధారణంగా కనిపిస్తుంది.

    తెలుగు సినిమాకు అవి ఊహించని స్థాయిలో ఎదుగుతున్నాయి. రాజమౌళి తన విలక్షణ దృక్పథంతో ఇండస్ట్రీని మలుపు తిప్పాడు.

    'SSMB 29' తో ఇండస్ట్రీ మరింత ఎత్తు చేరాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌ తరువాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు'' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

    మరోవైపు, భారతీయ సినిమా పరిశ్రమలో ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి తెరపైకి తీసుకొస్తున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో పేర్కొన్నారు.

    దీనితో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

    వివరాలు 

    లొకేషన్స్‌ ఎంపిక చేసే పనిలో బిజీగా రాజమౌళి 

    అమెజాన్ అడవుల నేపథ్యం లో సాగే ఈ కథలో ప్రముఖ విదేశీ నటులు కనిపించనున్నారు.

    ఈ చిత్రం భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లో కూడా విడుదల చేయబడుతుంది.

    ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై, కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు ఈ చిత్రంలో సరికొత్త పాత్రలో కనిపించనున్నారు.

    ఈ పాత్ర కోసం ఆయన ఇప్పటికే సన్నద్ధం అవుతూ, తన ప్రిపరేషన్‌లో ఉన్నారు.

    అలాగే, రాజమౌళి చిత్రానికి సంబంధించి పనులు ప్రారంభించడంతో ప్రస్తుతం లొకేషన్స్‌ ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమౌళి

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025