Page Loader
Hari Hara Veera Mallu: అద్భుతంగా 'హరి హర వీర మల్లు': పార్ట్ 1-కత్తి vs స్పిరిట్ టీజర్ 

Hari Hara Veera Mallu: అద్భుతంగా 'హరి హర వీర మల్లు': పార్ట్ 1-కత్తి vs స్పిరిట్ టీజర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2024
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా, హరి హర వీర మల్లు పార్ట్ 1: కత్తి వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్‌తో సినిమా మొదటి భాగం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో విజువల్స్ ఊహించని లెవెల్లో ఉన్నాయి.

Details 

జనం పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్

నైజాం నవాబు కాలంలో జనం పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అదిరిపోయింది. బాబీ డియోల్ పాత్ర తన మేకోవర్ కూడా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. అలాగే టీజర్ లో కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాల ఆలస్యం అయ్యినా కూడా ఇంత కాలం నిరీక్షణకు వర్త్ అనిపించేలా ఉందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ ని కూడా 2024 అన్నట్టే పెట్టడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్