Page Loader
HHVM : 'హరి హర వీరమల్లు' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
'హరి హర వీరమల్లు' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

HHVM : 'హరి హర వీరమల్లు' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్‌కు ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపు దిశగా నిర్మాత ఏఎం రత్నం చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని టికెట్ ధరల పెంపుపై చర్చించారు. తెలంగాణలో టికెట్ రేటు రూ.250 వరకు పెంచుకునేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం టికెట్ రేట్లను ఎక్కువగా పెంచుకునే విషయంపై పూర్తిగా సహకరించట్లేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో సంధ్యథియేటర్‌లో జరిగిన ఘటన తర్వాత, ప్రీమియర్ షోలు తగ్గించడంతో పాటు టికెట్ రేట్లపై నియంత్రణ పెంచారు.

Details

ఏపీలో ఎక్కువగా ఉండే అవకాశం

పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలకు మాత్రమే కొంతవరకు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నారు. వీరమల్లుకు కూడా ఇదే తరహా స్పెషల్ రేట్లు మొదటి వారం పాటు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. వారం తర్వాత మళ్లీ సాధారణ టికెట్ రేట్లే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ ఇప్పటికే టికెట్ ధరల పెంపు కోసం ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేయాలంటూ సూచించారు. ఆ దిశగా ఏఎం రత్నం చర్యలు చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ద్వారా అర్జీ పంపినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ అనుమతికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మాత్రం టికెట్ ధరలు తెలంగాణతో పోల్చితే కాస్త ఎక్కువగానే పెంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.