Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సౌత్, నార్త్ ఇండియా టాప్ నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మంచు విష్ణు తనయుడు అవరామ్ ఫస్ట్ లుక్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. అవరామ్ ఈ సినిమాలో తిన్నడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
అవరామ్ ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ పోస్టర్‌ను మోహన్ బాబు షేర్ చేసి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అవరామ్‌కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. "తనయుడి లుక్ విడుదల చేసినందుకు చాలా గర్వంగా ఉందని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.