Page Loader
celebs who got married in 2023: 2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?
2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?

celebs who got married in 2023: 2023లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలు వీళ్లే.. వివాహాలు ఎలా జరిగాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2023
09:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023లో చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు. నచ్చినవారితో ఏడడుగులు నడిచి వివాహా బంధానికి వెల్ కమ్ చెప్పారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో జరిగింది. ఇక టాలీవుడ్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Details

రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్న శర్వానంద్ 

ఇటలీలో నవంబర్ 1న వరుణ్-లావణ్య త్రిపాఠి వివాహం వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు పెద్దల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో శర్వానంద్, రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం జూన్ 2 రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

Details

నాల్గో పెళ్లి చేసుకున్న సీనియర్ యాక్టర్ నరేష్

మంచు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ టాలీవుడ్‌లో తనకంటూ ఓ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. మార్చి 3న మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మౌనికా రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. మౌనికా రెడ్డికి కూడాఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇక టాలీవుడ్‌లో సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర పెళ్లి ఈ ఏడాది హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి చేసుకున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక పవిత్రకు నరేష్‌తో మూడో పెళ్లి కాగా, నరేష్‌కు నాల్గో మ్యారేజ్ కావడం విశేషం.