
Allu Arjun : 'ఇది అందరికి గర్వకారణం'.. జాతీయ అవార్డులపై బన్నీ హార్షం!
ఈ వార్తాకథనం ఏంటి
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని పేర్కొంటూ, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని బన్నీ పేర్కొన్నారు. 33 ఏళ్లుగా సినిమాలలో ఉన్న షారుక్‌ఖాన్ ఈ పురస్కారానికి పూర్తిగా అర్హులని ప్రశంసించారు. ఈ అవార్డుతో ఆయన మరొక మెట్టు ఎక్కారని అభిప్రాయపడ్డారు. విద్యాభ్యాసంలో 12 ఫెయిలైనప్పటికీ నటనలో నేషనల్ అవార్డు గెలిచిన విక్రాంత్ మాసేకు స్పెషల్ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. ఉత్తమ తెలుగు సినిమాగా గుర్తింపు పొందిన 'భగవంత్ కేసరి' చిత్ర బృందాన్ని అభినందించారు.
Details
హీరో బాలకృష్ణ కు ప్రత్యేక అభినందనలు
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్న సుకృతికి ప్రత్యేక శుభాకాంక్షలు బన్నీ తెలిపారు. ఇది తనకే కాకుండా, సుకృతికి, ఆమె తండ్రి సుకుమార్‌కు గర్వకారణంగా ఉందని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, రచయిత కాసర్ల శ్యామ్‌లకు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలుగు సినిమాలకు ఈ ఏడాది భారీగా జాతీయ అవార్డులు రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తెలుగు సినిమా మరింత ఎదగాలని, రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.