LOADING...
New York India Day Parade : అమెరికాలో దేశభక్తి వేడుకలో మెరిసిన టాలీవుడ్ జంట!
అమెరికాలో దేశభక్తి వేడుకలో మెరిసిన టాలీవుడ్ జంట!

New York India Day Parade : అమెరికాలో దేశభక్తి వేడుకలో మెరిసిన టాలీవుడ్ జంట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా నివసించే ప్రతి భారతీయుడికీ స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేక గర్వకారణం. ఆగస్టు 15 రాగానే దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి ఉత్సాహం అలుముకుంటుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, అమెరికా సహా పలు దేశాల్లో కూడా ఈ జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచింది న్యూయార్క్‌లో జరిగే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతేడాది జరిగే ఈ వేడుక, విదేశాల్లో నివసించే భారతీయుల ఐక్యతను, దేశభక్తిని ప్రతిబింబించే అద్భుత వేదికగా ప్రసిద్ధి చెందింది. ఈసారి 43వ ఇండియా డే పరేడ్ మరింత ప్రత్యేకంగా మారింది.

Details

భారతీయ సంస్కృతిని ప్రతినిధిగా ప్రదర్శన

ఈ వేడుకలో టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్‌గా హాజరై, భారతీయ సంస్కృతిని ప్రతినిధిగా ప్రదర్శించారు. వేలాదిమంది భారతీయ అమెరికన్లు, ఇతర దేశాల ప్రజలు హాజరైన ఈ వేడుకలో వీరిద్దరూ మెరిసిపోవడంతో, అభిమానులకు ఇది నిజంగా పండుగ వాతావరణంలా అనిపించింది. స్టేజ్‌పై వీరి ఎంట్రీతో పాటు జాతీయ గీతం ప్రతిధ్వనించిన క్షణాలు ప్రతి ఒక్కరినీ దేశభక్తి ఉత్సాహంలో ముంచెత్తాయి. భారత్ వెలుపల జరుగుతున్న అతిపెద్ద ఇండియన్ పరేడ్ అయిన ఈ వేడుక ప్రతి భారతీయుడిలో గర్వభావాన్ని నింపింది. ఇక సోషల్ మీడియాలో విజయ్-రష్మిక జంట ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ, అభిమానుల్లో విశేష చర్చనీయాంశమయ్యాయి.