LOADING...
Tollywood: బాక్సాఫీస్‌ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!
బాక్సాఫీస్‌ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!

Tollywood: బాక్సాఫీస్‌ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 14, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరించే ప్రత్యేక సీజన్లు ఎన్నో ఉంటాయి. వాటిలో సంవత్సరపు తొలి భాగంలో సంక్రాంతి, వేసవి కాలం సినిమాలకు ప్రధాన వేదికలుగా నిలిస్తే, రెండో భాగంలో దసరా అత్యంత కీలకమైన సీజన్‌గా గుర్తింపు పొందింది. విద్యార్థులకు సెలవులు ఉండే ఈ కాలంలో కుటుంబ ప్రేక్షకుల రాక ఎక్కువగా ఉండటంతో, సాధారణంగా మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటాయి. అందుకే పరిశ్రమ వర్గాలు దసరాను 'మినీ సంక్రాంతి'గా పరిగణిస్తాయి. ఈ ఏడాది అయితే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోల సినిమాలు ఈ పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయనే వార్తలు వినిపించడంతో ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది.

వివరాలు

దసరా లక్ష్యంగా వెంకటేశ్‌ సినిమా..

గత మూడు సంవత్సరాలుగా వెంకటేశ్‌ సంక్రాంతి సీజన్‌లోనే ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం', ఈ ఏడాది చిరంజీవితో కలిసి చేసిన 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రాల ద్వారా విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47' (ఏకే 47) చిత్రంలో నటిస్తున్నారు. వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలను మేళవించిన ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రీకరణ చివరి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందుకోసం అక్టోబర్‌ మూడో వారంలోని ఒక తేదీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

నాగార్జున 100వ చిత్రం కూడా రేసులో..

నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కోసం దర్శకుడు రా కార్తీక్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం 'కింగ్‌ 100' అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ముగింపు దశకు చేరుకుంటోంది. ఆగస్టు నాటికి షూటింగ్‌ పూర్తిచేసి, దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రణాళికలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. విభిన్న శైలిలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున పలు కోణాలు కలిగిన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

బాలకృష్ణ దసరా బరిలోకి?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్రంతో బిజీగా ఉన్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో వేగంగా సాగుతోంది. ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటి నుంచే దీనిని దసరా సీజన్‌లో విడుదల చేసే అవకాశాలపై ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో చిత్రీకరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ డ్రామాలో బాలకృష్ణ స్టైలిష్‌ అవతారంలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక సినిమాలో ఆయన యాక్షన్‌ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Advertisement