
Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండిస్ట్రీలో 20 ఇళ్లు పూర్తి చేసుకున్న త్రిష(Trisha), ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.
ఇప్పటికే స్టార్ హీరోలందరితోనూ త్రిష నటించింది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు లిస్టులో ఆమె చేరుతున్నట్లు సమాచారం.
'బింబిసార' సినిమాతో హిట్ అందుకున్న వశిష్ఠ డైరక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో చిరుకి జోడిగా అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ హీరోయిన్లు ఇప్పటికే వినిపించాయి.
అయితే ఫైనల్‌గా త్రిష కు మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో స్టాలిన్ చిత్రంలో చిరంజీవి(Chiranjeevi)తో త్రిష కలిసి నటించింది.
అయితే 16 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Details
గతంలో స్టాలిన్ సినిమాలో చిరు సరసన నటించిన త్రిష
చిరు సినిమాలో త్రిష ఎంట్రీకి సంబంధించి మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మెగా 156లో విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ఈ సోషియో ఫాంటసీ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.
ప్రస్తుతం త్రిష మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది.