
Vijay Deverakonda : డియర్ రౌడీ ఫ్యాన్స్ అంటూ కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
కల్కి 2898 AD సినిమాలో స్పెషల్ రోల్‌తో వచ్చి ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
చిన్న చిన్న రోల్స్ చేసుకొని ఇవాళ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ ఎదిగాడు.
ప్రస్తుతం గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో తన 12వ సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించి లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఓ ఆఫిషియల్ అనౌన్స్ ను మూవీ టీం రిలీజ్ చేసింది.
details
60శాతం షూటింగ్ కంప్లీట్
డియర్ రౌడీ ఫ్యాన్స్, మీ అత్రుత అర్థమవుతోంది. అయితే VD12 టీం మీకు మరిచిపోలేని అనుభూతిని ఇవ్వడం ఖాయం.
ఇప్పటికే ఈ సినిమా సంబంధించి 60శాతం షూటింగ్ పూర్తి చేశామని మూవీ టీం పేర్కొంది.
కావున సోషల్ మీడియాలో వచ్చే లీక్స్‌ను నమ్మోద్దని, ప్రస్తుతం సినిమాని శ్రీలంకలో షూట్ చేస్తున్నామని తెలిపింది.
తాము ఫస్ట్ లుక్ ఎక్స్పీరియన్స్ అందరికి నచ్చుతుందని, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలను షేర్ చేయొద్దని కోరింది.