Page Loader
Samantha Alia Bhatt: జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా 
జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా

Samantha Alia Bhatt: జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "ఊ అంటావా మావా" సాంగ్ పాడిన ఆలియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆలియా భట్ ఓ మల్టీ టాలెంటెడ్ నటి. నటనతోపాటు ఆమె పాటలు కూడా బాగా పాడగలదు. తాను నటించిన సినిమాల్లో కొన్ని సాంగ్స్ పాడింది. అయితే, ఈ మధ్య కాలంలో తెలుగులోనూ సులభంగా పాటలు పాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తన తదుపరి మూవీ "జిగ్రా" ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ఆలియా, "పుష్ప 1" మూవీలోని "ఉ ఊ అంటావా" పాటను పాడింది.

వివరాలు 

ఆలియా నోట "ఉ ఊ అంటావా" 

బాలీవుడ్ నటి ఆలియా భట్ తన నెక్ట్స్ మూవీ "జిగ్రా" ప్రమోషన్లలో బిజీగా ఉంది.మంగళవారం (అక్టోబర్ 8)ఈ సినిమా ఈవెంట్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఈసినిమాను ప్రమోట్ చేయడానికి సమంత,రానా కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా"పుష్ప 1"లో సమంత చేసిన ఐటెమ్ సాంగ్"ఉ ఊ అంటావా"ని ఆలియా భట్ పాడింది. సిగ్గుపడుతూనే తెలుగులో ఈ పాట పాడింది ఆలియా. పక్కన ఉన్న సమంత పెద్దగా నవ్వుతూ ఆమెను హగ్ చేసింది. ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేసిన సుమ కూడా బాగా శ్రుతిలో పాడావంటూ ఆలియాను మెచ్చుకుంది. అటు రానా కూడా ఈ పాట అద్భుతంగా ఉంది అని అన్నాడు.ఆలియా ఈ పాట పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాలు 

చుట్టమల్లే పాట కూడా 

నిజానికి, ఆలియా తెలుగు పాట ఇదే తొలిసారి కాదు. ఈ మధ్యే "దేవర" మూవీ ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి కరణ్ జోహార్ నిర్వహించిన టాక్‌లో పాల్గొన్న ఆలియా, "చుట్టమల్లే" పాటను పాడింది. "దేవర కా జిగ్రా" అంటూ రెండు సినిమాల ప్రమోషన్లను కరణ్ నిర్వహించాడు. ఆలియా పాట విని, "వావ్" అంటూ తారక్ మెచ్చుకున్నాడు. ఇక తెలుగులోనూ విడుదలకాబోతున్న "జిగ్రా" మూవీ ప్రమోషన్ల కోసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చి "ఉ ఊ అంటావా" అని రెచ్చిపోయింది.

వివరాలు 

ఈవెంట్‌కు రావడానికి కేవలం 6.5 సెకన్లలో సమంత ఓకే 

ఈ సందర్భంగా సమంతపై ఆలియా ప్రశంసల వర్షం కురిపించింది."నా డియరెస్ట్ సమంత,స్క్రీన్ పై, బయట కూడా నువ్వు ఓ హీరో. నీ టాలెంట్ నాకు బాగా నచ్చుతుంది.నీకున్న బలం,దృఢత్వం కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పురుషుల ప్రపంచంలో ఓ మహిళ రాణించడం సులభం కాదు. కానీ నువ్వు హద్దులు చెరిపేశావు. నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు" అని ఆలియా పొగిడింది. ఈ ఈవెంట్‌కు రావడానికి కేవలం 6.5 సెకన్లలో సమంత ఓకే చెప్పిందని కూడా ఆమె వెల్లడించింది.

వివరాలు 

సమంత,తనతో కలిసి ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ అడిగిన ఆలియా 

ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా సమంత, తనతో కలిసి ఓ సినిమా చేయాలని ఆలియా త్రివిక్రమ్ ని అడిగింది. "నటీమణులు పోటీ పడుతుంటారని అనుకుంటారు, కానీ తన సినిమాను ఓ పాన్ ఇండియా స్టార్ ప్రమోట్ చేయడానికి రావడం, తన గురించి మంచి మాటలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని ఆలియా చెప్పింది. "జిగ్రా" మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 11) థియేటర్లలో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఊ అంటావా... పాడుతున్న అలియా