
Rowdy Janardhan-Vijay Devarakonda: డిజాస్టర్ల పరంపరకు స్టాప్ గా విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్'
ఈ వార్తాకథనం ఏంటి
అర్జున్ రెడ్డి(Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ఆ క్రేజ్ను ఉపయోగించుకుంటూ గీతగోవిందం(Geetha Govindam)సినిమాను చేశాడు.
అది ఒక రేంజ్ లో హిట్ అయింది.
ఇక ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ లో విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్టు పడలేదు.
మధ్యలో పాన్ ఇండియా మూవీ అంటూ పూరి జగన్నాథ్ తో లైగర్ (Liger) ప్రాజెక్ట్ చేసిన కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిపోయింది.
సమంతతో ఖుషి (Khushi) సినిమా చేసిన అది యావరేజ్ గానే మిగిలిపోయింది ఇక లాభం లేదనుకుని గీతగోవిందం డైరెక్టర్ పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ చేశాడు.
సినిమా హిట్ అయినా డబ్బులు మాత్రం రాలేదు.
Vijay Devarakonda-New Project
విజయ్ దేవరకొండ బర్త్ డే రోజు వివరాలు వెల్లడి
ఈ క్రమంలోనే దిల్ రాజు (Dil Raju)తో మరో సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు టైటిల్ గా రౌడీ జనార్ధన్ (Rowdy janardhan)ను ఖాయం చేశారు.
ఈ చిత్రం వివరాలు విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ .