Ranabaali : విజయ్ దేవరకొండ 'రణబాలి' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'రణబాలి'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు, 'మమ్మి' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 'రణబాలి' చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాను సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. 'రణబాలి' రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. కొత్త విడుదల తేదీని కూడా వెల్లడించారు.
వివరాలు
అక్టోబర్ 16న విడుదల..
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న 'రణబాలి'ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
1878 కాలంలో రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 'రణబాలి' అనే యోధుడి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది.
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
ఇందులో విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా, భుజంపై భారీ కత్తిని పెట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.