Vijay-Rashmika : రోమ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: విజయ్-రష్మిక రొమాన్స్ నెట్టింట వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఇటలీలోని చారిత్రక నగరం రోమ్‌లో వీరు కొత్త ఏడాది సంబరాలను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకోగా, అందులోని ఓ రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో విజయ్ వెనక నిలబడి రష్మిక అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.
వివరాలు
రష్మిక ఇచ్చిన హగ్ ఈ ఫోటోలకు ప్రత్యేక ఆకర్షణ
ఈ ఫోటోకు విజయ్ ఎమోషనల్ టచ్ ఇస్తూ, "హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. మనమందరం కలిసి మరెన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకుందాం" అంటూ ఓ హృదయాన్ని తాకే సందేశాన్ని జత చేశారు. రోమ్‌లోని ప్రసిద్ధ స్మారక చిహ్నాల ముందు విజయ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, వెనుక నుంచి రష్మిక ఇచ్చిన హగ్ ఈ ఫోటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల అనంతరం ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎన్నో రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ గాసిప్‌లకు తెరదించుతూ గతేడాది అక్టోబర్ 2025లో విజయ్ - రష్మిక రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.
వివరాలు
మిమ్మల్ని పెళ్లి దుస్తుల్లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం
తాజా అప్‌డేట్స్ ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరగనుందని తెలుస్తోంది. ఈ కారణంగానే నూతన సంవత్సర వెకేషన్‌ను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అభిమానులు "మిమ్మల్ని పెళ్లి దుస్తుల్లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్
Happy new year my darling loves ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) December 31, 2025
May we grow up together, make great memories, do great things, spread love, cheer and life.
Biggest kisses and hugs to all of you. 🤗❤️ pic.twitter.com/Nlxw7NapMM