Page Loader
Vishal Political Entry: రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ నటుడు క్లారిటీ 
రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ నటుడు క్లారిటీ

Vishal Political Entry: రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్ నటుడు క్లారిటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2024
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ నటుడు విశాల్ తాను రాజకీయాల్లోకి రావడం లేదని బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. విశాల్ తన అభిమాన సంఘం ద్వారా కష్టాల్లో ఉన్న వారిని కలుస్తున్నానని,సహాయం చేస్తూనే ఉన్నానని విశాల్ తన ప్రకటనలో తెలిపారు. రానున్న కాలంలో రాజకీయ ప్రవేశం ఉండబోతుందన్న సంకేతాలను కూడా ఇచ్చారు. తలపతి విజయ్ తన రాజకీయ అరంగేట్రం ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, విశాల్ దానిని అనుసరిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

Details 

ఆర్‌కే నగర్‌ ఉపఎన్నికల్లో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణ

నటుడిగా,సామాజిక సేవకుడిగా నన్ను గుర్తించిన తమిళనాడు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.తనకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదివిస్తున్నా, రైతులకు సాయం చేస్తున్నా ఎటువంటి లాభాలను ఆశించి తానూ ఆ పని చేయట్లేదని తెలిపారు. ఇప్పుడైతే తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నఆయన.. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతనని బుధవారం హీరో విశాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 2017లో ఆర్‌కే నగర్‌ ఉపఎన్నికల్లో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఎందుకంటే విశాల్‌కి కేవలం ఎనిమిది మంది చెల్లుబాటయ్యే ప్రపోజర్లు మాత్రమే ఉండడంతో రిటర్నింగ్ అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా,ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం 'రత్నం'షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.