Page Loader
chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎదురుకాల్పుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు, గత గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని తెలంగాణ సరిహద్దులో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా, బిజాపూర్‌ జిల్లా బాసగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో కోబ్రా బెటాలియన్‌ కానిస్టేబుళ్లు మృదుల్‌ బర్మన్, మహ్మద్‌ ఇషాఖ్‌ గాయపడ్డారు.

వివరాలు 

పూజారి కాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం

తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక - ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పూజారి కాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టారు.