Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 19 మంది మావోయిస్టుల మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మావోయిస్టులు మరణించారు.
నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో మొదట నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, తరువాతి సమయంలో ఈ సంఖ్య 12కి పెరిగింది.
ఈ రోజు ఉదయానికి మొత్తం 19 మంది మావోయిస్టులు చనిపోయినట్లు నిర్ధారించారు.
తెలంగాణ సరిహద్దులో ఉన్న బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతాలలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఎస్ఎల్ఆర్, బీజీసీ వంటి ఆయుధాలతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
ఆపరేషన్‌లో వెయ్యి మంది కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు
ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు బీజాపూర్, సుకుమా, దంతేవాడ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు తరలివచ్చినట్లు సమాచారం.
మావోయిస్టులు సమావేశం అవుతున్నట్టు సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు వెళ్లి ఎన్‌కౌంటర్‌ను ప్రారంభించారు.
సమావేశం అనంతరం అడవిలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్న మావోయిస్టులపై భద్రతా బలగాలు వెంటాడి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
భద్రతా బలగాలు మావోయిస్టులను ఎవరినీ విడిచిపెట్టకుండా క్రమంగా ఆపరేషన్‌ను కొనసాగించారు.
వివరాలు
2024లో మొత్తం 270 మందికి పైగా మావోయిస్టులు మృతి
జనవరి నెలలో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మరణించారు.
ఇదిలా ఉండగా, భద్రతా బలగాలు 9 మంది మందు పాతర పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.
2024లో మొత్తం 270 మందికి పైగా మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందారు.
ఈ నెల 6న బీజాపూర్ జిల్లాలోని కుట్టు వద్ద జరిగిన మందు పాతర పేలుడులో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో బీజాపూర్‌లో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా దృష్టి పెట్టింది. దీంతో ఈ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి.